ఆమెని ‘కనికరించిన’ అల్లు అర్జున్

హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఇటీవల పోస్ట్ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. హీరో అల్లు అర్జున్ ఆమెని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు. ఆ విషయాన్ని ఆమె పోస్ట్ చేసింది. అంతే కాదు, అల్లు అర్జున్ సరసన తాను నటించినా తనకు ఒరిగిందేమి లేదని ఆమె దొప్పిపొడిచింది.

దాంతో, ట్విట్టర్లో అల్లు అర్జున్ అభిమానులు, అల్లు అభిమానుల వ్యతిరేకుల మధ్య ఆన్ లైన్ వార్ జరిగింది.

ఆ విషయం అల్లు అర్జున్ కి చేరింది. దాంతో, బన్నీ ఆమెని అన్ బ్లాక్ చేశాడు. ఆ తర్వాత ఆమె ఆ విషయాన్నీ ట్విట్టర్ లో షేర్ చేసింది. “నా కెరీర్ ఎదగకపోవడానికి, ఆయనికి సంబంధం లేదు. ఆయన్ని నేను ఎప్పుడూ నిందించలేదు. నన్ను అన్ బ్లాక్ చేసి తన మంచి మనసుని బయటపెట్టుకున్నాడు బన్నీ,” అంటూ భానుశ్రీ ఆ తర్వాత బన్నిని పొగుడుతూ పోస్ట్ చేసింది.

భానుశ్రీ మెహ్రా ‘వరుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి అప్పట్లో చాలా హైప్ వచ్చింది. కానీ, ఆ సినిమా దారుణ పరాజయం పాలు అయింది. ఆమెకి పెద్దగా ఆఫర్లు రాలేదు. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు కూడా ఆమెకి క్రేజ్ ని తెచ్చిపెట్టలేదు.

Advertisement
 

More

Related Stories