అల్లు అర్జున్ అలా సినిమా చూస్తాడంట

Allu Arjun wears Rowdy Club brand

హీరోలకు కూడా హిట్ సినిమాలు చూడాలని ఉంటుంది. ఆడియన్స్ మధ్య కూర్చొని థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ పొందాలని ఉంటుంది. కానీ అలా వెళ్లడం సాధ్యం కాదు. మరి తప్పనిసరి పరిస్థితుల మధ్య వెళ్లాల్సి వస్తే ఏం చేస్తారు? ఈ విషయంలో బన్నీ ఏం చేస్తాడో తెలుసా?

ఎఫ్3 సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్యే విదేశీ పర్యటన పూర్తిచేసుకొని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్.. ఈ సినిమాను క్యూబ్ లో వేయించుకొని ఇంట్లో చూడాలని అనుకున్నాడట. కానీ అల్లు అరవింద్ వారించారట. ఎఫ్3 లాంటి హిలేరియస్ మూవీని ఆడియన్స్ మధ్య థియేటర్లలో కూర్చొని చూడమని సలహా ఇచ్చారట.

అరవింద్ సూచన మేరకు బన్నీ మాస్క్ వేసుకొని, మారువేషంలో ఎఫ్3 సినిమా చూసి వచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ బయటపెట్టారు. అంతేకాదు.. ఆడియన్స్ ఎక్కువగా ఉండే కూకట్ పల్లి ఏరియాలో ప్రేక్షకుల మధ్య కూర్చొని ఎఫ్3 సినిమాను బన్నీ చూశాడనే విషయాన్ని అరవింద్ బయటపెట్టారు.

ఈమధ్య సాయిపల్లవి కూడా ఇలానే చున్నీ కప్పుకొని, మాస్క్ వేసుకొని, వదులైన దుస్తులు ధరించి.. ఎవ్వరూ గుర్తుపట్టని విధంగా సినిమా హాల్ కు వెళ్లి ఓ సినిమా చూసొచ్చింది. సినిమా ముగిసి బయటకొచ్చిన తర్వాత ఎవరో ఆమెను కెమెరాలో బంధించారు. బన్నీ కూడా అదే విధంగా సినిమా చూశాడన్నమాట.

 

More

Related Stories