మొత్తానికి ఉప్పెన చూసిన బన్నీ

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో… వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడే వైష్ణవ్ తేజ్. అతని తొలి చిత్రం…ఉప్పెన. ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలైంది. మెగా హిట్ అయింది. దాదాపు 50 కోట్ల షేర్ అందుకొంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్… ఇలా అందరూ తమ కుటుంబం నుంచి వస్తున్న మరో హీరోకి తెగ ప్రమోషన్, హైప్ ఇచ్చారు. సినిమా విడుదలయ్యాక… ట్వీట్లు కూడా వేశారు.

ఐతే, ఈ సినిమా గురించి అల్లు అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో రకరకాల రూమర్లు వచ్చాయి. ‘పుష్ప’ షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ ఇన్నాళ్లూ చూడలేకపోయాడు. ఇప్పుడు షెడ్యూల్ గ్యాప్ రావడంతో ఈ రోజు హైదరాబాద్ లో స్పెషల్ షో వేసుకొని మూవీ చూశాడు.

హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబుని తెగ మెచ్చుకున్నాడు బన్నీ. సినిమా ఇంత పెద్ద హిట్ కావడంలో వింతేమీ లేదు..అంతా బాగా తీశారు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. మొత్తానికి రూమర్లకు ఇలా చెక్ పెట్టాడు అల్లు అర్జున్.

More

Related Stories