
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు అల్లు అర్జున్ దూరంగా ఉన్నారు. గత నెలలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు మెగా క్యాంప్ హీరోలందరూ హాజరయ్యారు. కానీ బన్నీ వెళ్ళలేదు. దాంతో, మెగాభిమానులు అల్లు అర్జున్ ని ట్రోల్ చేశారు.
ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు అల్లు అర్జున్ ఉదయం 9 గంటల లోపే ట్వీట్ చేయడం విశేషం. సాధారణంగా అంత పొద్దునే బన్నీ సోషల్ మీడియా పోస్ట్లు పెట్టడు. కానీ ఇప్పుడు తప్పలేదు. పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక ఫోటో షేర్ చేస్తూ విషెస్ తెలిపాడు బన్నీ. ఆ తర్వాత జనసేన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపినట్లు ఒక పోస్ట్ కూడా వచ్చింది.
తమ మధ్య ఇప్పటికే పెరిగిన దూరాన్ని అల్లు అర్జున్ తగ్గించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు వేరుగా ఉంటున్నారు. అల్లు అర్జున్ ని తమ వాడిగా భావించడం లేదు. సోషల్ మీడియాలో ఈ చీలిక కనిపిస్తుంటుంది. ఒకప్పుడు రామ్ చరణ్ ని ‘నెంబర్ వన్’ హీరో అని పిలిచిన బన్నీ ఇప్పుడు ‘నయా మెగాస్టార్’ అనిపించుకునే ప్రయత్నం చేయడం వల్లే వారి మధ్య గ్యాప్ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో?