భార్యకి విషెష్ చెప్పిన బన్ని


మార్చి 6, 2011న అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఒకటయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్నేహ అందానికి, ఆమె మంచితనానికి అల్లు అర్జున్ ఫిదా అయ్యారు. వారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. అల్లు అర్జున్, స్నేహ జంట చాలా మందికి ఆదర్శం.

ఇక ఈ రోజు తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భార్యని కౌగిలించుకొని దిగిన ఒక సెల్ఫీ ఫోటోని షేర్ చేశారు. “హ్యాపీ యానివర్సరీ క్యూటీ,” అని భార్యకి ఇన్ స్టాగ్రామ్ లో విషెస్ చెప్పారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయనకి 20 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. 20 మిలియన్ల ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న మొదటి దక్షిణాది హీరోగా అల్లు అర్జున్ ఒక కొత్త రికార్డు నెలకొల్పారు.

ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్నారు. మరో రెండు సినిమాలు కూడా సైన్ చేశారు.

 

More

Related Stories