కూతురికి బన్నీ స్పెషల్ గిఫ్ట్

అల్లు అర్జున్ కూతురు అర్హ ఈరోజు తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ”పుష్ప” సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చాడు బన్నీ.

పొద్దున్న అర్హను నిద్రలేపి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు అల్లు అర్జున్. కూతుర్ని ఏకంగా గుర్రం ఎక్కించాడు. “నా కూతురుకు చిన్న సర్ ప్రైజ్” అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేశారు. అంతకంటే ముందు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. రెండు గిఫ్ట్ బాక్సులు ఇచ్చాడు.

మరోవైపు అల్లు అర్జున్ ఆర్మీ కూడా అర్హ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ”అంజలి..అంజలి” అనే పాటకు అర్హ విజువల్స్ యాడ్ చేసి ఓ క్యూట్ వీడియో రిలీజ్ చేసింది. ఈరోజు ఆ వీడియోను బాగానే ట్రెండ్ చేసింది అల్లు ఆర్మీ.

మరో 2 వారాల పాటు మారేడుమిల్లి అటవీప్రాంతంలోనే ఈ షూటింగ్ జరుగుతుంది.

Related Stories