
అల్లు అర్జున్ ఒక పద్దతి ప్రకారం తన మార్కెట్ ని పెంచుకుంటున్నారు. బన్నీ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. “పుష్ప 2” విడుదలకి ఇంకా చాలా టైముంది కానీ ఆ సినిమాకి గ్లోబల్ లెవల్లో క్రేజ్ వచ్చేలా ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకుంటున్నారని అర్థం అవుతోంది.
ఆయనకి సోషల్ మీడియాలో కూడా క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్స్ అయ్యారు. సౌత్ ఇండియన్ హీరోలలో ఆయనకే అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.
తాజాగా దుబాయ్ మేడం టుస్సాడ్స్ లో బన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కూడా ఆయనకి మరింతగా రీచ్ పెంచుతుంది. “పుష్ప” సినిమా ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో హిట్ అయింది. ఇప్పుడు “పుష్ప 2” పాన్ ఇండియా స్థాయి కన్నా ఎక్కువ హిట్ కావాలని ఆలోచనలో ఉన్నారు బన్నీ. అటువైపు ఆయన అడుగులు వేస్తున్నారు. ఆయనకీ అన్నీ కలిసి వస్తున్నాయి అనిపిస్తోంది.
మరోవైపు, “పుష్ప 2” సినిమా విడుదల కాగానే అట్లీ దర్శకత్వంలో భారీ సినిమా చెయ్యనున్నారు.
ALSO READ: Allu Arjun at Madame Tussads: ‘Excited & Grateful’