- Advertisement -

అతడి పేరు నాగేశ్వరరావు. ఊరు మాచర్ల. బన్నీకి వీరాభిమాని. ఎలాగైనా అల్లు అర్జున్ ను కలవాలనుకున్నాడు. మామూలుగా వెళ్తే గేట్ కూడా టచ్ చేయనివ్వరు. పైగా తన అభిమానం ఏ స్థాయిలో కూడా చూపించుకోవాలి. అందుకే బన్నీ కోసం ఏకంగా పాదయాత్ర చేపట్టాడు.
మాచర్ల నుంచి హైదరాబాద్ వరకు “జై బన్నీ” అంటూ పాదయాత్ర షురూ చేశాడు. లాక్ డౌన్ నిబంధనలు, ముందు జాగ్రత్తలు పాటిస్తూ హైదరాబాద్ వరకు నడుచుకుంటూ వచ్చాడు. రోజుకు 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు నడుస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు.
తన కోసం 200 కిలోమీటర్లకు పైగా నడిచిన నాగేశ్వరరావును బన్నీ ప్రత్యేకంగా కలిశాడు. అతడితో ఫొటోలు దిగాడు. ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యం వాకబు చేశాడు. తన కోసం అంత దూరం నుంచి వచ్చిన నాగేశ్వరరావుకు ఓ మొక్క, కొన్ని మాస్కులు అందజేశాడు.