అల్లు అర్జున్ తర్జన భర్జన!

Allu Arjun


‘పుష్ప’ సినిమాకి మొదట మిశ్రమ స్పందన వచ్చింది. ఫైనల్ గా మాత్రం హిట్. ఐతే, తుది ఫలితం కూడా పరిశీలిస్తే ప్రధాన తెలుగు మార్కెట్ లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు తక్కువే.

ఏపీలో పెద్దగా ఊపు రాలేదు. బ్రేక్ ఈవెన్ కాలేదు. తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెంచడం వల్లే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వచ్చింది. సాధారణ రేట్లతో ఆడి ఉంటే నష్టాలే వచ్చాయి. ఓవర్సీస్ లో మంచి విజయమే దక్కించుకొంది. ఓవరాల్ గా, ‘పుష్ప’ తెలుగు మార్కెట్ లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా) గొప్ప విజయం సాధించలేదు. తెలంగాణాలో, అమెరికాలో ‘అల వైకుంఠపురం’ కలెక్షన్లు అందుకోలేకపోయింది. ఇక ఏపీలో పూర్తిగా నష్టాలే.

మరి ఇది ఎక్కడ పెద్ద హిట్ అయింది అని అడిగితే హిందీ మార్కెట్ లో అనూహ్యమైన కలెక్షన్లను సంపాదించింది. తమిళనాడులో బాగా ఆడింది. కేరళలో కూడా ఓకే (బన్నీకి అక్కడ ఎప్పుడూ మార్కెట్ ఉంది). ‘పుష్ప’ సాధించింది ఏంటంటే… అల్లు అర్జున్ కి రెండు కొత్త మర్కెట్స్ ని తెచ్చిపెట్టింది. నార్త్ ఇండియాలో బన్నీకి ఇప్పుడు మార్కెట్ వచ్చింది. ఆ విధంగా ఇది పెద్ద హిట్. బన్నీకి రేంజ్ పెరిగింది.

ఐతే, రెండో పార్టు విషయంలో మాత్రం తేడా రాకూడదు. తెలుగు మార్కెట్ లో ఫెయిల్ కావొద్దని అల్లు అర్జున్, సుకుమార్ డిసైడ్ అయ్యారు. దాని కోసం కసరత్తులు మొదలు పెట్టారు.

 

More

Related Stories