బన్నీ మాట, బాట వేరు!


అల్లు అర్జున్ మీద మెగాభిమానులు గుస్సాగా ఉన్నారట. ‘అఖండ’ ఈవెంట్ లో జై బాలయ్య అంటూ అల్లు అర్జున్ హడావుడి చేశారట. దాంతో, మెగాభిమానులు కొంచెం ఫీల్ అయ్యారని టాక్. బాలకృష్ణ ఈవెంట్ కి వెళ్లడంలో కానీ, బాలయ్యని పొగడడంలో కానీ మెగాభిమానులకు అభ్యంతరం లేదు. సీనియర్ అగ్ర కథానాయకుడు అయిన బాలయ్యకి ఆ గౌరవం ఇవ్వడం తప్పు లేదంటున్నారు వాళ్ళు.

మరి గుస్సా దేనికి?

గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ‘జై పవర్ స్టార్’ అని అనాల్సిందిగా ఒక ఈవెంట్ లో కోరారు. దానికి, బన్నీ సీరియస్ అయ్యి…. “చెప్పను బ్రదర్” అంటూ కోప్పడ్డ విషయాన్నీ గుర్తు చేస్తున్నారుఫ్యాన్స్. పవన్ కల్యాణ్కి జై కొట్టేందుకు రాని మనసు బాలయ్య కోసం ఊగిందా? ఈ కోణంలో మెగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అల్లు అర్జున్ మాట, బాట వేరుగా ఉందట.

ఐతే, అల్లు అర్జున్ అభిమానులు, బాలయ్య అభిమానులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. బాలయ్య వంటి సీనియర్ హీరో మూవీకి మెయిన్ గెస్ట్ గా వెళ్లడం అంటే మా వాడి స్థాయి పెరిగిందని ఒప్పుకున్నట్లే అనేది బన్నీ ఫ్యాన్స్ మాట. బాలయ్య ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ తో సమస్య లేనట్లుంది. ఎందుకంటే, అల్లు వారి ‘ఆహా’ కోసం ఇప్పటికే బాలయ్య “అన్ స్టాపబుల్” కార్యక్రమం చేస్తున్నారుగా.

 

More

Related Stories