అమృతసర్ లో అల్లు స్నేహ వేడుకలు

అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్. ‘పుష్ప’ సినిమాతో జాతీయ స్థాయిలో పెద్ద స్టార్ గా ఎదిగారు. హీరోగా కెరియర్ కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు అల్లు అర్జున్.

రెగ్యులర్ గా తన కూతురు వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు అల్లు అర్జున్. ఈ రోజు తన సతీమణి స్నేహ పుట్టినరోజు వేడుకల ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చెయ్యడం విశేషం. స్నేహ రెడ్డి హ్యాష్ టాగ్ ఈ రోజు ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఆమె బర్త్ డేని పురస్కరించుకొని అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు అల్లు అర్జున్ . అక్కడ ప్రార్థనలు చేసి దేవుడి ఆశీస్సులు పొందారు. ఒక సాధారణ భక్తుడిలానే ఆ టెంపుల్ లోకి వెళ్లారు.

మరోవైపు, అల్లు స్టూడియోస్ అనే ఒక ఫిలిం స్టూడియోని అల్లు అర్జున్ కుటుంబం నిర్మించింది. గండిపేట సమీపంలోని ఈ స్టూడియో అక్టోబర్ 1న ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రారంభిస్తారు.

 

More

Related Stories