బాలయ్య క్యాంప్ లో అల్లు!

Balakrishna


అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే వారి వ్యవహారశైలి ఉంది. పైకి తామంతా ఒకటే… పండుగలప్పుడు అందరమూ కలిసి ఫోటోలు దిగుతాం, భోజనం చేస్తాం వంటి స్టేట్మెంట్లు ఎలా ఉన్నా… ఒకప్పుడు చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఉన్న ‘జిగ్రీ’ ఇప్పుడు లేదు. ఇది నిజం.

ఇక అల్లు అరవింద్, నందమూరి బాలకృష్ణ మధ్య మాత్రం బంధం పెనవేసుకుపోయింది. ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ డిజైన్ చేసింది, దానికి హోస్ట్ గా బాలయ్యని ఒప్పించింది అల్లు అరవింద్. ఇక ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రావడంతో అది మరింత ముందుకెళ్లింది వీరి బంధం.

ఇప్పుడు అల్లు శిరీష్ సినిమా ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ వస్తున్నారు. బాలయ్య, అల్లు క్యాంప్ ఇప్పుడు ఒకటే అని మరోసారి ప్రూవ్ అయింది.

అల్లు అర్జున్ కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. తన అల్లు ఆర్మీ గురించే చెప్పుకుంటున్నాడు.

 

More

Related Stories