
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ లేటెస్ట్ గా ఒక ఫోటో షేర్ చేసింది. ఉదయ్ పుర్ లో నిహారిక వెడ్డింగ్ కి సంబంధించిన సంగీత్ లో భార్యాభర్తలు జంటగా మంచి ఫోటో తీసుకున్నారు. స్నేహ చాలా ఫ్యాషనబుల్ గా రెడీ అయ్యారు. అల్లు అర్జున్… స్టైలిష్ స్టార్ అన్న తన ఇమేజ్ కి తగ్గట్లే యమా స్టైలిష్ గా ఉన్నారు ఈ ఫొటోలో. ఈ జంట చూడముచ్చటగా ఉంది.
ఐతే, స్నేహ పక్కన ఉన్న టేబుల్ పై రెండు వైన్ తో నిండిన గ్లాసులు కూడా తమ ఫొటోలో పడిన విషయాన్ని చూసుకోలేదు కాబోలు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం వదిన… ఆ గ్లాసులు దాచండి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్స్ పెడుతున్నారు.
అయినా… సంగీత్ అన్నా తర్వాత విందు, మందు, చిందు కామన్ కదా! గ్లాస్ లు ఉంటే తప్పు ఏముంది? అలాంటి ఫంక్షన్ లో మందు గ్లాస్ లు, ఫుడ్ ప్లేట్స్ ఫ్రేమ్ లో పడకుండా ఫోటో తీసుకోవాలంటే కాస్త కష్టమే.