
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీటింగ్ కి నాగార్జున వెళ్ళలేదు. లాస్ట్ మినిట్ లో ఆయన తప్పుకున్నారు. దానికి కారణం ఆయన భార్య అమలకి కరోనా సోకడమే. ప్రస్తుతం అమల ఐసోలేషన్ లో ఉన్నారు. దాంతో, నాగార్జున కూడా ఇంటివద్దే ఉండిపోయారు.
బంగార్రాజు సినిమా ప్రొమోషన్స్ చేస్తున్నప్పుడు ఈ సినిమా టీంలో చాలామంది కరోనా బారిన పడ్డారు. దాంతో, హైదరాబాద్ లో బాగా కేసులు పెరుగుతున్నాయని నాగార్జున గోవా వెళ్లి వచ్చారు. ఫిబ్రవరి ఒకటివరకు అక్కడే ఉన్నారు. “ది ఘోస్ట్” అనే సినిమా షూటింగ్ కోసం ఈ మొదటివారంలో దుబాయ్ వెళ్లాలని రెడీ అవుతున్న తరుణంలో హీరోయిన్ సోనాల్ చౌహన్ కరోనా బారిన పడింది. దాంతో షూటింగ్ వాయిదా పడింది.
ఇప్పుడు అమలకి కరోనా సోకింది. మొత్తమీద, నాగార్జునని ఎదో రూపంలో కరోనా వెంటాడుతోంది రెండు నెలలుగా.
ప్రస్తుతం అమల ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉంది. ఆమె బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారట.