- Advertisement -

అమలా పాల్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి వివాదాలతో మొన్నటివరకు వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత హాట్ హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియా జనాలని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఆమె తన కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్లుంది. అవును.. అమల పాల్ వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తోంది.
ఆమె ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం ఒక “లస్ట్ స్టోరీస్” తెలుగు వెర్షన్లో బోల్డ్ గా ఒక పాత్ర చేసింది. లేటెస్ట్ గా లోకల్ ఓటిటి కంపెని నిర్మిస్తోన్న ఒక వెబ్ డ్రామాలో నటిస్తోంది. ఈ రెండూ కూడా వచ్చే ఏడాది స్ట్రీమ్ అవుతాయి. సినిమా అవకాశాలు తగ్గాయి కాబట్టి ఇప్పుడు వెబ్ డ్రామాలపై ఫోకస్ పెట్టింది.
అమలా పాల్ కి తమిళనాట కూడా ఛాన్సులు రావట్లేదు. ధనుష్ తో ప్రేమాయణం అని పుకార్లు, దర్శకుడు ఏ.ఎల్. విజయ్ తో డివోర్స్ కారణంగా ఆమెని కోలీవుడ్దూరం పెట్టింది.