అవి కనపడుతున్నాయి! ఐతే ఏంటి?

Amala Paul

అమల పాల్ బోల్డ్ గా నటిస్తుంది. నిజ జీవితంలో కూడా ఆమె వైఖరి అలాగే ఉంటుంది. ఎటువంటి సంకోచం లేకుండా సూటిగా మాట్లాడుతుంది. ఇటీవల ఆమె కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. ఒక పార్టీలో ఆమె ఫుల్లుగా డ్యాన్స్ చేసింది. మైమరచిపోయి ఎంజాయ్ చేసింది ఆ పార్టీని. ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఆ వీడియో కింద కొందరు ఆకతాయి కుర్రాళ్ళు ఇండీసెంట్ గా కామెంట్స్ పెట్టారు. “అవి కనపడుతున్నాయి… ” అంటూ ఒకడు పోస్ట్ పెట్టాడు. అలాంటి మెసేజ్ లను చూసీ, చూడనట్లు వదిలేస్తారు హీరోయిన్లు. లక్షల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న భామలకు వచ్చిన కామెంట్స్ అన్ని చదివే ఓపిక ఉండదు కదా! కానీ, అమల మాత్రం ఆ కామెంట్స్ కి గట్టిగా సమాధానం ఇచ్చింది.

“అవును… అవి కనిపిస్తున్నాయి. ఐతే ఏంటంట? మనం 2021లో ఉన్నాం….” అంటూ జవాబు ఇచ్చింది. ఇంకా సనాతన భావాలు ఏంట్రా బాబూ అన్నట్లుగా బోల్డ్ గా రిప్లయ్ ఇచ్చింది. ఆమె రిప్లై కి కూడా వేలల్లో లైకులు రావడం విశేషం.

అమల పాల్ ప్రస్తుతం వెబ్ సినిమాల్లో ఎక్కువగా దర్శనం ఇస్తోంది. తెలుగులో ‘పిట్టకథలు” (నెట్ ఫ్లిక్స్), “కుడి ఎడమైతే” (ఆహా) వంటి వెబ్ సిరీస్ లలో కనిపించింది.

 

More

Related Stories