“అంబాజీపేట”కి టీజర్ ఫిక్స్

- Advertisement -
Ambajipeta Marriage Band

కమెడియన్ సుహాస్ హీరోగా కూడా విజయాలు పొందుతున్నాడు. ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్నాడు. దాంతో, మరో నాలుగు చిత్రాలు లైన్లో ఉన్నాయి. అందులో ముందుగా రానున్న చిత్రం… “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”.

జీఏ2 పిక్చర్స్, హాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రాన్ని. దుశ్యంత్ కటికినేని అనే కొత్త దర్శకుడు తీస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

కామెడీ కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు.శివాని నాగరం హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు ఇంకా.

 

More

Related Stories