
అమీషా పటేల్ ని జనం మర్చిపోయి చాలా కాలమే అయింది. 20 ఏళ్ల క్రితం ఆమె సూపర్ హిట్ చిత్రాల హీరోయిన్. “కహో నా ప్యార్ హై”, “గదర్ ఏక్ ప్రేమ్ కథ”, “బద్రి” వంటి చిత్రాలతో సంచలనాలు సృష్టించింది అమీషా. ఇప్పుడు ఆమెకి 47 ఏళ్ళు.
మళ్ళీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం. “గదర్”కి సీక్వెల్ గా “గదర్ 2” రూపొందింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో 40 కోట్ల వసూళ్లు అందుకొంది.
సింగల్ స్క్రీన్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నిండిపోతున్నాయి. నార్త్ ఇండియాలో హవా అలా ఉంది. బాలీవుడ్ సినిమాల పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో దాదాపుగా రిటైర్ అయిపోయిన సన్నీ డియోల్, అమీషా పటేల్ కలిసి నటించిన ఈ సినిమా మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్లు అందుకోవడం అంటే పెద్ద రికార్డు కొట్టినట్లే.
సినిమా మరీ నాసిరకంగా ఉందట. సినిమా కథ,కథనాలు పాత చింతకాయపచ్చడి అని అంటున్నారు. అయినా… కూడా ఈ కలెక్షన్లు అంటే గ్రేట్.

అమీషా పటేల్ కొన్నాళ్లుగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఒంపుసోపులు చూపించి లైమ్ లైట్లో ఉంటోంది. ఈ సినిమా సక్సెస్ తో మళ్ళీ “సినిమా హీరోయిన్”గా గుర్తింపు దక్కుతుంది.