అమీర్ ఖాన్ కి మొదలైన టెన్షన్!

- Advertisement -
Laal Singh Chaddha



బాలీవుడ్ చిత్రాలకు కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్ రావడం లేదు. బాలీవుడ్ పెద్ద హీరోల్లో ఒకరైన షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ మొదటి వీకెండ్ కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. దేశమంతా వచ్చిన వసూళ్లు. మరోవైపు, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘కేజీఎఫ్ 2’ వంటి దక్షిణాది చిత్రాలు హిందీ మార్కెట్ లో వందల కోట్ల వసూళ్లు అందుకున్నాయి.దాంతో, అమీర్ ఖాన్ కి టెన్షన్ మొదలైంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ స్థాయి, స్థానం వేరు. ఆయన సినిమాలు తొలి రోజు 50 కోట్ల వసూళ్లు అందుకుంటాయి. ఐతే, అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాకి ఆ స్థాయి ఓపెనింగ్ వస్తుందా అన్నది పెద్ద డౌట్ గా మారింది.

‘లాల్ సింగ్ చద్దా’ మాస్ చిత్రం కాదు. ఎమోషనల్ మూవీ. దేశభక్తి చిత్రం. క్లాస్ మూవీ. సో.. భారీ వసూళ్లు రావడం అంత సులువు కాదు. అందుకే, అమీర్ ఖాన్ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ‘కేజీఎఫ్ 2’ వంటి దక్షిణాది చిత్రాలు మొదటి రోజు హిందీ మార్కెట్ లో 50 కోట్ల వసూళ్లు అందుకున్నప్పుడు అమీర్ ఖాన్ మూవీ అంతకన్నా ఎక్కువే అందుకోవాలి.

బాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ ఈ ఏడాది విడుదల కానున్నాయి. కరోనాకి ముందు రిలీజ్ కావాల్సిన చిత్రాలన్నీ ఈ ఏడాది థియేటర్లలోకి వస్తున్నాయి.అమీర్ ఖాన్ గత చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ పరాజయం పాలైంది. సో, ‘లాల్ సింగ్ చద్దా’తో భారీ హిట్ కొట్టాలి అమీర్.

 

More

Related Stories