ప్రభాస్ ని కలవనున్న అమిత్ షా!

Prabhas


తెలంగాణాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ అగ్ర నాయకత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దింపాలని పట్టుదలగా ఉన్న ఈ పార్టీ నిత్యం ఎదో ఒకటి చేస్తూ హంగామా చేస్తోంది రాష్ట్రంలో. సెప్టెంబర్ 17 (తెలంగాణ విమోచన/విలీన దినోత్సవం)న మరోసారి కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అమిత్ షా హైదరాబాద్ రానున్నారు.

బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా … ప్రభాస్ ని కూడా కలిసే అవకాశం ఉందని రాజకీయ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఇటీవలే కృష్ణంరాజు మరణించారు. కృష్ణంరాజు ఇంటికి వెళ్లి అమిత్ షా నివాళులు అర్పిస్తారని, ఆ తర్వాత ప్రభాస్ ని, ఇతర కుటుంబ సభ్యులని పరామర్శిస్తారని అంటున్నారు.

కృష్ణంరాజు గతంలో బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చేశారు. ఆయన బీజేపీ సభ్యులే. అందుకే, అమిత్ షా ప్రభాస్ ని కలిసి పరామర్శిస్తారట.

ఇటీవల అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ దుమారం రేపింది. ప్రభాస్ ని అమిత్ షా కలిస్తే అలాంటి వివాదం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ సందర్భం అలాంటిది.

 

More

Related Stories