50 కోట్ల ఇల్లు కూతురికి

Amitabh Bachchan

అమితాబ్ బచ్చన్…. ఇండియన్ సినిమాలో గొప్ప నటుడు. ఒకప్పుడు తిరుగులేని సూపర్ స్టార్. ఇప్పటికీ ఏడాదికి కోట్లు కోట్లు సంపాదించే నటుడు ఆయన. ఇప్పటికే తెలుగులో “సైరా” వంటి సినిమాల్లో నటించిన అమితాబ్ త్వరలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న “కల్కి”, రజినీకాంత్ కొత్త సినిమాలో కూడా కనిపిస్తారు.

అమితాబ్ కి ఇప్పుడు 81 ఏళ్ళు. ఈ వయసులో కూడా బిజీగా ఉన్న అమితాబ్ ఇప్పుడు ఆస్తులను తన వారసులకు పంపకాలు చేసే పనిలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కి ముంబైలో చాలా ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నివాసం ఉండే “జల్సా” అనే ఇళ్లుతో పాటు “ప్రతీక్ష” అనే మరో ఇల్లు బాగా పాపులర్.

అమితాబ్ కుటుంబం చాలా ఏళ్ళు “ప్రతీక్ష” అనే ఇంటిలోనే నివాసం ఉండేది. ఇప్పుడు “జల్సా”లో ఉంటోంది వారి కుటుంబం. ఈ ఇంటిని తన కుమారుడికి ఇస్తున్నారు బిగ్ బి. ఇక “ప్రతీక్ష” అనే ఇల్లును తన కూతురు శ్వేతకి ఇచ్చారు. తాజగా గిఫ్ట్ డీడ్ రూపంలో కూతురు పేర రిజిస్టర్ చేశారు.

ఈ ఇంటి విలువ దాదాపు 50 కోట్లు.

Advertisement
 

More

Related Stories