కల్కి డేట్ అదే: అమితాబ్

- Advertisement -
Amitabh Bachchan

“కల్కి 2898 AD” చెప్పిన డేట్ కే విడుదల అవుతుంది అని అమితాబ్ బచ్చన్ చెప్తున్నారు. బిగ్ బి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది, ముందే ప్రకటించిన తేదికి (మే 9, 2024) సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు టీం ప్రయత్నిస్తోంది అని అమితాబ్ అంటున్నారు.

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ ఒక గురువుగా నటిస్తున్నారు.

“కల్కి 2898 AD” షూటింగ్ చివరి దశకు చేరుకున్న మాట నిజమే కానీ ఈ సినిమాకి ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు (షూటింగ్ పూర్తి అయిన రోజు గుమ్మడికాయ కొట్టడం సినిమా ఇండస్ట్రీలో పద్దతి). అందుకే, ఈ సినిమా విడుదల తేదీపై అనుమానాలు ఉన్నాయి.

కానీ, అమితాబ్ బచ్చన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మే 9వ తేదీ విడుదలకు టీం అంతా కష్టపడుతోంది అని చెప్పారు అమితాబ్ బచ్చన్.

బిగ్ బి గతంలో “మనం”, “సైరా” చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. కానీ “కల్కి”లో మాత్రం ఆయనది చాలా పెద్ద పాత్ర, ప్రధానమైన పాత్ర. ఈ సినిమాలో అమితాబ్ తో మరో లెజండరీ నటుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు.

 

More

Related Stories