
ఐశ్వర్య లక్ష్మి గురించి ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. పొన్నియన్ సెల్వన్ (PS-1)లో తన పూంగుజాలి పాత్రతో ఆకట్టుకొంది. “అలనై నీకై” పాటలో అందాలు ఈ భామవే. ఐశ్వర్య లక్ష్మి నటించిన మరో చిత్రం “అమ్ము”. ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అక్టోబర్ 19న రిలీజ్.
ఇదివరకే రిలీజైన మూవీ టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో.
గృహ హింసకు గురైన ఒక అమ్మాయిగా ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో కనిపిస్తుంది. నవీన్ చంద్ర ఈ సినిమాలో అమ్ము భర్తగా నటించాడు. భార్య భర్తల అనుబంధంతో పాటు వాళ్ళ మధ్య జరిగే గొడవలను కూడా ఆవిష్కరించాడు దర్శకుడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.