తల్లులు కాబోతున్న హీరోయిన్లు

హీరోయిన్లంతా వరుసగా తమ ప్రెగ్నెన్సీ మేటర్స్ బయటపెడుతున్నారు. త్వరలోనే అమ్మతనం లోకి ప్రవేశించబోతున్నామంటూ ప్రకటిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి అమృతారావు కూడా చేరిపోయింది. ఈమె ఇప్పుడు 3 నెలల గర్భవతి.

2016లో RJ అన్మోల్ ను పెళ్లి చేసుకుంది అమృత. ఏడేళ్ల పాటు వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు. తర్వాత సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లయిన నాలుగేళ్లకు అమృత ప్రెగ్నెంట్ అయింది. పెళ్లి మేటర్ ఆమె బయటపెట్టలేదు. ఇప్పుడు గర్భవతి అనే విషయాన్ని కూడా ఆమె బయటకు చెప్పలేదు. అలా అని దాచే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ భామ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముంబై పత్రికలూ ఫోటోని క్లిక్ మనిపించాయి. అలా.. ఆమె గర్భవతి అని అర్థమైంది.

తెలుగులో “అతిథి” సినిమాలో నటించింది అమృత.

అమృత కంటే కొన్ని రోజుల ముందు హీరోయిన్ అనిత తన గర్భం విషయాన్ని బయటపెట్టింది. పెళ్లయిన ఏడేళ్లకు అనిత, మదర్ హుడ్ లోకి ఎంటర్ అవ్వబోతోంది. త్వరలోనే తను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని, తన భర్తతో కలిసి ప్రకటించింది ఈమె.

వీళ్లిద్దరి కంటే ముందే తన ప్రెగ్మెన్సీ మేటర్ ను బయటపెట్టింది అనుష్క శర్మ. విరాట్ కోహ్లిని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 4 నెలల గర్భవతి. అటు హీరోయిన్ కరీనా కపూర్ కూడా రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Related Stories