అమృతకి మొదటి బిగ్ హిట్!

Amritha Aiyer


29 ఏళ్ల అమృత అయ్యర్ గత పదేళ్ళుగా నటిస్తోంది. తమిళ్ లో రజినీకాంత్ “లింగా”, విజయ్ “బిగిల్” వంటి పెద్ద సినిమాల్లో నటించింది. ఐతే ఈ రెండు పెద్ద సినిమాల్లో ఆమె హీరోయిన్ కాదు.

ఆమె హీరోయిన్ గా ఎక్కువగా తెలుగులోనే సక్సెస్ పొందింది. తెలుగులో ఆమె “రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా”, “రెడ్”, “అర్జున ఫల్గుణ” వంటి సినిమాలు చేసింది. ఐతే ఆమెకి నాలుగో తెలుగు చిత్రం మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. “హను మాన్” చిత్రంలో ఆమె హీరోయిన్. ఈ సినిమా ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తోంది.

అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరో తేజ సజ్జ సరసన నటించింది. ఇది రెగ్యులర్ రొమాంటిక్ చిత్రం కాదు. మాస్ సినిమా కాదు. కానీ ఆమెకి పెద్ద పాత్ర దక్కింది. ఆ విధంగా భారీ సక్సెస్ పొంది ఇప్పుడు సామాన్య ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో వచ్చిన పాపులారిటీ ఒక ఎత్తు ఈ ఒక్క సినిమాతో వచ్చిన క్రేజ్ మరో ఎత్తు.

ఇప్పడు అమృతకి మరిన్ని అవకాశాలు లభించడం ఖాయం. మరి ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న “జై హనుమాన్” చిత్రంలో ఈ అమ్మడికి పాత్ర ఉంటుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి హీరో తేజ సజ్జకి భారీగా క్రేజ్ దక్కినట్లే ఈ భామకి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement
 

More

Related Stories