
అమృతా అయ్యర్ ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ‘రెడ్’, ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ వంటి సినిమాల్లో కనిపించిన ఈ భామ నటించిన కొత్త మూవీ… అర్జున ఫల్గుణ. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ మూవీ ఈ నెలాఖరులో విడుదల కానుంది. అలాగే, ‘హను మాన్’ అనే మూవీ కూడా చేస్తోంది.
ఈ తమిళ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు కూడా బాగా మాట్లాడుతోంది. “సినిమాల్లోకి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. నాకు హీరోల్లో అల్లు అర్జున్, హీరోయిన్ సమంత అంటే ఇష్టం,” అని చెప్తోంది ఈ బ్యూటీ.
పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. కానీ, ఇలాంటి పాత్రలు మాత్రమే చెయ్యాలని గిరిగీసుకోలేదంట. ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే ఫోకస్ అంటోంది. “తమిళంలో ఇంకా సినిమాలు ఓకే చేయలేదు,” అని పేర్కొంది.
‘అర్జున ఫల్గుణ’ సినిమా కథ కొత్తగా ఉంటుంది అని అంటోంది.