
యువ హీరో ఆనంద్ దేవరకొండ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకొని ఆయన నటిస్తున్న కొత్త సినిమాల పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్.
కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రం… హైవే. ఇందులో ఆనంద్ సరసన మానస రాధాకృష్ణన్ నటిస్తోంది. వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా బర్త్ డే పోస్టర్ విడుదలైంది. హిల్ స్టేషన్ లో ఈ యువహీరో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందీ పోస్టర్.
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మరో మూవీ… బేబీ. SKN నిర్మిస్తున్న ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకుడు. ఈ పోస్టర్ విభిన్నంగా ఉంది.
ఆనంద్ దేవరకొండ మరో డిఫరెంట్ ఫిల్మ్ “గం.. గం.. గణేశా”. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.