ఓటీటీకి దేవరకొండ సినిమా

Anand Deverakonda

చాన్నాళ్లుగా థియేటర్లు తెరుచుకోలేదు. వచ్చే నెలలో తెరిచినా చిన్న సినిమాలకు దారి దొరుకుతుందనే గ్యారెంటీ లేదు. ఒకవేళ ఓ చిన్న సినిమా థియేటర్లలోకి వచ్చినా ఆక్యుపెన్సీ ఉంటుందనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన రెండో సినిమా కూడా ఓటీటీ బాట పట్టింది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేశాడు ఆనంద్ దేవరకొండ. వినోద్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఆ సినిమా పేరు “మిడిల్ క్లాస్ మెలొడీస్”. తొలి సినిమాలో అచ్చమైన తెలంగాణ కుర్రాడిగా, తెలంగాణ యాసలో అదరగొట్టిన ఆనంద దేవరకొండ.. ఈ సినిమాలో ఆంధ్రా కుర్రాడిగా కనిపించబోతున్నాడు. మరీ ముఖ్యంగా గుంటూరు స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పబోతున్నాడు.

ఇప్పుడీ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ దక్కించుకుంది. నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్.

Related Stories