
ఒకప్పుడు మంచి పాటలే రాసిన పాటల రచయిత అనంత శ్రీరామ్ ఇప్పుడు చిత్ర విచిత్ర పదాలతో, అర్థంపర్థంలేని పదప్రయోగాలతో చికాకు తెప్పిస్తున్నారు. విమర్శల పాలు అవుతున్నారు. ఆ మధ్య ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం “కళావతి” అనే పాటలో ఆయన రాసిన పదాలు బాగా ట్రోలింగ్ కి గురి అయ్యాయి.
ఇప్పుడు ఒక అనువాద చిత్రంలో కూడా ఇలాంటి అసంబద్ధ ప్రయోగాలే చేసారు. మణిరత్నం తీస్తున్న ‘పొన్నియన్ సెల్వన్ 1″ కోసం “సై” అనే పాటలో ఆయన వాడిన పదాలు ఘోరంగా వినిపిస్తున్నాయి. ఒక చోట “గందరగోళుడా”,”అయోమయుడో” అంటూ పదాలు జొప్పించాడు.
“గ్రంథసాంగుడా సై గందరగోళుడా సై
అమాయకుడో అయోమయుడో సై” అంటూ సాగే ఈ పాటలో ఆయన చేసిన పద ప్రయోగాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. గందరగోళానికి గురయ్యేవాడు గందరగోళుడా? అయోమయానికి గురయ్యేవాడు అయోమయుడా? అలా అనోచ్చా?
రైమింగ్ కోసం ఇలా అనంత శ్రీరామ్ స్వయంగా గందరగోళుడవుతున్నాడు.