అనన్య: ఇలాగే ఉండాలని రూలేమీ లేదు

Ananya Nagalla

‘మల్లేశం’ చిత్రంతో పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ‘వకీల్ సాబ్’ చిత్రంలో కీలక రోల్ పోషించింది. ఆమె నటించిన ‘ప్లే బ్యాక్’ సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది. ‘వకీల్ సాబ్’ ఆమెకి బిగ్ బ్రేక్ కానుంది. ఈ హైదరాబాదీ భామతో ముచ్చట్లు…

  • ‘మల్లేశం’ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూసి దర్శకుడు శ్రీరామ్ వేణు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ‘వకీల్ సాబ్’ అఫర్ ఇప్పటికి ఒక కలలా అనిపిస్తుంటుంది. ఇందులో నేను అమాయకురాలైన ఒక అమ్మాయి పాత్ర పోషించా.
  • పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన చెప్పిన కొన్ని విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. శృతి హాసన్ తో నాకు సీన్స్ లేవు.
  • నివేదా థామస్, అంజలి నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాను. అంజలి గారితో చాలా ఫన్ గా ఉండేది. ఆమె ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండేది. నివేదా సీరియస్ పర్సన్. ఇద్దరూ చాలా సపోర్ట్ చేశారు.
  • తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువ వస్తాయి అన్నది నిజమే. తెలుగు అమ్మాయిలు ఆటిట్యూడ్ చూపిస్తారు అనే ముద్ర వేశారు. దానివల్ల ఛాన్సులు తక్కవ. కానీ ఇతర సమస్యలు లేవు ఇక్కడ.
  • ట్రెడిషనల్ గా కనిపించే పాత్రలే చెయ్యాలని రూల్స్ ఏమి పెట్టుకోలేదు. ప్రస్తుతం రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఫర్మార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కు ప్రిపరెన్స్ ఇస్తాను. రీసెంట్ గా మరో రెండు చిత్రాలు సైన్ చేశాను.

More

Related Stories