అనన్య పాండేకి హ్యాపీ న్యూస్

TeluguCinema 26 Aug 2023
Ananya Panday

“లైగర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనన్య పాండే మొత్తానికి ఒక హిట్ అందుకునేలా ఉంది. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం… “డ్రీం గర్ల్ 2”. ఆయస్మాన్ ఖురానా హీరో. ఈ సినిమా నిన్న విడుదలైంది. మొదటి రోజు ఇండియాలో 10 కోట్ల రూపాయల ఓపెనింగ్ తెచ్చుకొంది.

ఇటీవల అక్షయ్ కుమార్ వంటి పేరున్న హీరోలు నటించినా పది కోట్ల ఓపెనింగ్ బాలీవుడ్ చిత్రాలకు రావడం లేదు. ఆ లెక్కన చూస్తే “డ్రీం గర్ల్ 2″కి మంచి ఓపెనింగ్ వచ్చింది.

ALSO CHECK: Ananya Panday’s new clicks

అనన్య పాండే ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనీ, ఆ సినిమాకి ఓపెనింగ్ కూడా రాదనీ బాలీవుడ్ విశ్లేషకులు కొందరు ఈ సినిమా రిలీజ్ కి ముందు కామెంట్ చేశారు. కానీ, వారి అంచనాలు, విశ్లేషణలు తప్పు అయ్యాయి. అందుకే, అనన్య పాండేకి ఇది చాలా హ్యాపీ మూమెంట్.