అనన్య కూడా ఓపెన్ డేటింగ్

Ananya Panday

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతోంది బాలీవుడ్ భామ అనన్య పాండే. ప్రముఖ నటుడు చంకి పాండే కూతురు అనన్య. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది.

ఈ భామ కొత్త ఏడాది సందర్భంగా వార్తల్లోకి ఎక్కింది. కియారా అద్వానీలాగే అనన్య కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. ముంబై ఎయిర్పోర్ట్ వద్ద ఫొటోగ్రాఫర్లకు ఈ జంట చిక్కింది. ఇన్నాళ్లూ సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్న అనన్య ఇప్పుడు ఓపెన్ అయిపోయింది.

ఈ న్యూ ఇయర్ తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లి ఇలా తమ డేటింగ్ మేటర్ ని బయటపెట్టిన హీరోయిన్లు పలువురు ఉన్నారు. కియారా అద్వానీ (సిద్ధార్థ్ మల్హోత్రాతో లవ్), అనన్య పాండే (ఇషాన్ ఖట్టర్ తో రొమాన్స్), దిశా పటాని (టైగర్ స్రోఫ్), అలియా భట్ (రణబీర్ కపూర్)… ఇలా లిస్ట్ పెద్దదే.

More

Related Stories