‘ఫైటర్’ బ్యూటీ కరోనా నిర్ణయం

Ananya Panday

కరోనా వచ్చి ఎంతోమంది లైఫ్ స్టైల్స్ తో పాటు మైండ్ సెట్స్ కూడా మార్చేసింది. ఈ లిస్ట్ లోకి అనన్య పాండే కూడా చేరిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ తీస్తోన్న సినిమాలో అనన్య పాండే హీరోయిన్. నిన్నే 22వ బర్త్ డే జరుపుకొంది ఈ చిన్నది.

కరోనా రాకతో ఎలా బతకాలో తెలుసుకున్నాననంటోంది ఈ బ్యూటీ. మరీ ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండడం ఎంత అత్యవసరమో తెలుసుకున్నానని చెబుతోంది.

కెరీర్ ఆరంభించినప్పట్నుంచి ఎప్పుడూ గ్యాప్ తీసుకోలేదట అనన్య పాండే. కనీసం వీకెండ్స్ కూడా ఖాళీగా ఉండలేదంట. అలాంటి తనకు 6 నెలలు గ్యాప్ వచ్చేసరికి పిచ్చెక్కిపోయిందని చెప్పుకొచ్చింది. ఎన్నో నెగెటివ్ ఆలోచనలో చుట్టుముట్టాయని, అప్పుడే మానసికంగా దృఢంగా ఉండడం ఎంత అవసరమో తెలుసుకున్నానంటోంది అనన్య పాండే. ఇకపై మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండడమే తన తొలి ప్రాధాన్యం అంటోంది.

6-7 నెలల గ్యాప్ తర్వాత తొలిసారి ఆమె సెట్స్ పైకి వచ్చింది. గోవాలో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొంది. ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే, విజయ్ దేవరకొండ-పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న సినిమాలో జాయిన్ అవుతానని ప్రకటించింది.

Related Stories