
అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఇషాన్ చాలా కాలం ప్రేమలో ఉన్నారు. ఐతే, ఈ ఏడాది ప్రారంభంలో వీరి బ్రేకప్ జరిగింది. తాజాగా అనన్య పాండే మరో హీరోతో డేటింగ్ మొదలుపెట్టిందని విషయాన్నీ కరణ్ జోహార్ బయట పెట్టారు.
అనన్య ఇప్పుడు ఆ విషయాన్ని దాచడం లేదు. రీసెంట్ గా ఆమె, ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ కలిసి ఒక పార్టీలో సందడి చేశారు. బాలీవుడ్ లో దీపావళికి ముందు దివాళి పార్టీలు ఇవ్వడం రివాజు. హీరోయిన్ కృతి సనన్ ఇచ్చిన దివాళి పార్టీలో అనన్య పాండే, ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ ఒక రేంజులో హల్చల్ చేశారట. పార్టీలో ఈ జంట మెయిన్ అట్రాక్షన్ గా నిలిచిందట.
ఆదిత్య రాయ్ కపూర్ కి 36 ఏళ్ళు. ఆయన ఇప్పటికే పలువురు భామలతో డేటింగ్ లు, బ్రేకప్పులు చేసుకున్నాడు. తనకన్నా 12 ఏళ్ల చిన్నదైన అనన్య పాండేతో ఇప్పుడు ప్రేమాయణం మొదలుపెట్టాడు.
అనన్య మాత్రం ఇంకా తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి చిక్కలేదు. ఈ దీపావళి మాత్రం అతనితోనే జరుపుకుంటోందని బాలీవుడ్ మీడియా వార్తలను బట్టి అర్థం అవుతోంది.