లైగర్ భామ దమ్ము కొడుతుందట!


అనన్య పాండే అనగానే క్యూట్ లుక్స్ తో అమాయకంగా కనిపించే ముఖం మాత్రమే గుర్తొస్తుంది. ఐతే, ఆమె రియల్ లైఫ్ లో కూడా అలాగే ఇన్నోసెంట్ గా ఉంటుందని ఆమె అభిమానులు, ఇతరులు భావించారు. కానీ, ఆమె ఒక ఫంక్షన్ కి వెళ్లి కాసేపు తర్వాత బయటికి వచ్చి దమ్ము కొడుతున్న వైనం కెమెరా కంటికి చిక్కింది.

ఆ ఫోటోని ఆ ఫంక్షన్ కి వెళ్లిన అతిధి ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది బాగా వైరల్ అయింది. దాంతో, వెంటనే ఆ ఫోటోని డిలిట్ చేయించింది అనన్య పాండే టీం. కానీ ఇప్పటికే దాన్ని పలువురు సేవ్ చేసి పెట్టుకున్నారు.

తన కజిన్ మెహంది ఫంక్షన్ కి వెళ్లినప్పుడు ఇలా సిగరెట్ ఉఫ్ ఉఫ్ అంటూ లాగించేసింది. అలా ఆమె స్మోకింగ్ హ్యాబిట్ గురించి అందరికీ తెలిసింది. దాంతో సోషల్ మీడియా జనం ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

ఐతే, అనన్య పాండే కాదు దాదాపు ఈ రోజు టాప్ హీరోయిన్లుగా చలామణీ అవుతున్న కథానాయకులు అందరూ హీరోలలాగే సిగరెట్, మందు గట్టిగా లాగిస్తారు. అందులో వింతేమీ లేదు. తప్పేమీ కాదు. కాకపోతే, ఇలా ఫోటోలు బయటికి వచ్చినప్పుడు అభిమానులు కొంచెం షాక్ అవుతారు.

అనన్య పాండే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగింది. ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత ఆమెకి మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు.

 

More

Related Stories