దానికంటే గొప్ప పాత్ర: అనసూయ

Anasuya Bharadwaj

అనసూయ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం…. ‘రంగస్థలం’. ఆమెలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలోనే ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర కన్నా ‘పుష్ప’లో రోల్ మరింత గొప్పగా ఉంటుంది అని చెప్తోంది అనసూయ. కథని మొత్తంగా మలుపు తిప్పే రోల్ అని అంటోంది.

సుకుమార్ తనకి మంచి పాత్రలు ఇస్తున్నారని సంబరపడుతోంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా నిలిచిపోయింది. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్, అనసూయపై గత నెలలో కొన్ని సీన్లు తీశారు. ఆ టైంలోనే అల్లు అర్జున్ కి కరోనా సోకింది. దాంతో అనసూయ కూడా కొద్దీ రోజులు ఐసోలేషన్ లో ఉంది. కానీ ఆమె కరోనాని సేఫ్ గా తప్పించుకొంది.

ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాలు, తమిళంలో ఒకటి, మలయాళంలో మరోటి చేస్తోంది అనసూయ. నటిగా బిజీగా మారింది.

More

Related Stories