వేశ్య పాత్రలో అనసూయ!

వేశ్య పాత్రలో అనసూయ!

వేశ్య పాత్రలో అనసూయ నటిస్తోంది అని ప్రచారం జరుగుతోంది. అనుష్క వంటి బడా స్టార్ హీరోయిన్ అలాంటి పాత్రల్లో మెప్పించారు. అనసూయ ఆ పాత్ర పోషిస్తే వింత ఏముంది?

గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి తీస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ఆమె ఇలా దర్శనమిస్తుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాని అల్లు అరవింద్ క్యాంప్ కి చెందిన GA2 Pictures నిర్మిస్తోంది. ఆ సంస్థ తీస్తున్న ‘చావు కబురు చల్లగా’లో ఇప్పటికే ఐటెం సాంగ్ చేసింది. దాంతో ఈ వార్తల నిజమే అనుకున్నారంతా.

కానీ ఈ వార్తలపై మారుతీ వెంటనే స్పందించాడు. అలాంటి పాత్ర ఏది కూడా అనసూయ తమ సినిమాలో చెయ్యడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

అనసూయ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడంపై దృష్టి పెట్టింది. ఐటెం సాంగ్స్, స్పెషల్ రోల్స్, హీరోయిన్ గా, విలన్ గా, ఆంటీగా… ఇలా రకరకాల్లో ఆమెని చూడబోతున్నాం. కృష్ణవంశీ తీస్తున్న ‘రంగ మార్తాండ’, ‘థాంక్యూ బ్రదర్’ సినిమాలో గర్భవతిగా, ఒక తమిళ్ సినిమాలో సినిమా నటిగా, రవితేజ ‘ఖిలాడీ’లో నెగెటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటిస్తోంది.

More

Related Stories