- Advertisement -

అనసూయ అన్ని రకాల పాత్రలు చేస్తోంది. ‘పుష్ప’లో ఆంటీగా కనిపించనుంది. ఒక తాజాగా మరో కొత్త సినిమా ప్రారంభించింది. ఇందులో ఆమెనే హీరోయిన్. జయశంకర్ అనే దర్శకుడు తీస్తున్న ఈ సినిమాలో తాను కొత్తగా కనిపిస్తాను అంటూ కొత్త ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ.
ఇందులో ఆమె ఎయిర్ హోస్టెస్ గా కనిపిస్తుందని అంటున్నారు.
‘పుష్ప’లో ఆమె గెటప్ కి బాగా నెగటివ్ మార్కులు వచ్చాయి. సినిమా విడుదల తర్వాత ఆమె పాత్ర బాగుంటే ట్రోలింగ్ ఉండదు. ఐతే, ఈ కొత్త సినిమా కోసం కొంచెం మోడరన్ లుక్ ని డిజైన్ చేసుకొంది అనసూయ.
ఒకప్పుడు బుల్లితెరపై బిజీగా ఉండేది అనసూయ. ఇప్పుడు వెండితెరపై కూడా ఎక్కువ సినిమాల్లో దర్శనమివ్వనుంది.