
ప్రముఖ నటి అనసూయకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఫాలోయింగ్ తో పాటు ట్రోలింగ్ కూడా అధికమే. ఆమెని తరుచుగా ట్రోల్ చేస్తుంటారు సోషల్ మీడియా జనం. మొదట్లో తనని ట్రోల్ చేసేవారికి, విమర్శించే వారికి గట్టిగా రిప్లై ఇచ్చేవారు అనసూయ. ఆ తర్వాత కొన్నాళ్ళకు వారితో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు.
ఒక దశలో ట్రోలింగ్ సెగ తట్టుకోలేక సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఐతే, ఇప్పుడు ఆమె కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివిటీ తగ్గించారు. అలాగే, ఎవరి కామెంట్లకు రెస్పాండ్ కావడం లేదు. ఫోటోషూట్ షేరింగ్ లు కూడా చాలా మేరకు తగ్గించారు. ఆమె ఇప్పుడు లైఫ్ లో ప్రశాంతత కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. అందుకే, ఆన్ లైన్ గొడవలకు దూరమయ్యారు.
ప్రస్తుతం ఆమె నటిగా మంచి బిజీగా ఉన్న మాట వాస్తవం. ‘పుష్ప 2’ సహా పెద్ద ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి.
Photos: Anasuya in Chikkaballapur