మళ్ళీ మొదలుపెట్టిన అనసూయ

పది రోజుల తర్వాత అనసూయ మళ్ళీ పాత పాట అందుకున్నట్లు కనిపిస్తోంది. తనని “ఆంటీ” అని పిలిస్తే ఊరుకోను అంటూ ట్రోలర్స్ ని హెచ్చరించడంతో అనసూయ పేరు ఆ మధ్య ట్విట్టర్లో ట్రెండ్ అయింది. “ఆంటీ” అనే హాష్ టాగ్ హల్చల్ చేసింది.

రెండు రోజులు ట్విట్టర్లో ప్రతివాడికి రిప్లై ఇస్తూ హడావిడి చేసిన అనసూయని చాలా మంది విమర్శించారు. లక్షల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎన్నో కామెంట్స్ వస్తాయి… అవన్నీ చదివి వాటికి రిప్లై ఇవ్వడం అంటే అటెన్షన్ కోసమే అన్న కామెంట్స్ బాగా వినిపించాయి. దాంతో, రెండు రోజుల్లో ఆ హడావిడి ముగించారు. మళ్ళీ ఉన్నట్లుండి ఈ రోజు అదే ఆట మొదలు.

ఆమె ఈ రోజు ఓనం శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఆమె పోస్ట్ కి సంబంధం లేని కామెంట్ ని ఎవరో పెట్టారు. “కేసు పెడతాను అన్నావు కదా ఏమైంది,” అనేది ఆ పోస్ట్ అర్థం. దానికి ఆమె సమాధానం ఇస్తూ త్వరలోనే మీ భరతం పెడుతారు పోలీసులు అన్నట్లుగా రిప్లై ఇచ్చారు అనసూయ. అక్కడితో బాగానే ఉండు.

ఆ తర్వాత మళ్ళీ అందరి కామెంట్స్ కి సమాధానాలు ఇచ్చే పని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

 

More

Related Stories