
అనసూయ ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉంది. అమెరికాలో ఉన్న పలు తెలుగు సంఘాలు ఆమెని అమెరికాకి పిలిచాయి. తమ సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు అతిథిగా ఆమెని ఆహ్వానించాయి. ఆమె అక్కడ గ్లామరస్ ఫోటోషూట్ లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ మధ్య ఆమె అందాల ఆరబోతకు దూరంగా ఉంటాను అన్నారు. కొంచెం గ్లామర్ షో డోస్ తగ్గించారు కొన్నాళ్ళు. గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ వరుసగా గ్లామరస్ ఫోటోషూట్స్ చేసున్నారు. గతవారం ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అందులో జెన్నిఫర్ లోపెజ్ తరహా స్టాకింగ్స్ ధరించి అందాల కనువిందు చేశారు.
తాజాగా ఆమె ఇప్పుడు సాన్ హోసే నగరంలో ఉన్నట్లు ఉన్నారు. అక్కడి నుంచి ఆమె పోస్ట్ చేసిన తాజా ఫోటోలు కూడా హాట్ హాట్ గా ఉన్నాయి. ఆమె తన టోన్డ్ లెగ్స్ కనిపించేలా ఫోజులు ఇచ్చారు.
40కి చేరువలో ఉన్న ఈ భామ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఈ మధ్య ఫిట్ నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దాంతో పాటు గ్లామర్ షో డోస్ కూడా మళ్ళీ పెంచుతున్నట్లు కనిపిస్తోంది.

ALSO CHECK: Anasuya Bharadwaj’s unconventional style
అనసూయ నటిగా కూడా బిజీ బిజీ. “పుష్ప 2” వంటి భారీ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాగే మరో రెండు పెద్ద సినిమాలు కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఆ మధ్య ఆమె వివాదాస్పద ట్వీట్లతో ఎక్కువగా వార్తల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ట్విట్టర్ వివాదాలకు ఆమె బ్రేక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ ఇంతకుముందు ట్వీట్లు పోస్ట్ చేసిన అనసూయ రీసెంట్ గా విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన “బేబీ” సినిమా టీంని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆనంద్ దేవరకొండ నటనని కూడా మెచ్చుకున్నారు.