అనసూయ పద్దతి మార్చింది కదా!


ఒకప్పుడు అనసూయ నిత్యం ట్రోలింగ్ కి గురయ్యేది. ఆమె వేసుకున్న దుస్తులను ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు ట్రోలర్స్. చాన్నాళ్లు ఆమె వాళ్ళతో ఫైట్ చేసింది. కొన్ని సార్లు బాధతో, మరికొన్ని సార్లు బెదిరిస్తూ పోస్టులు పెట్టింది. అయినా, ట్రోలర్స్ తగ్గలేదు. చివరికి వీళ్ళతో ఎందుకొచ్చిన తంటా అని ఆమె సర్దుకొంది.

ఇప్పుడు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఫోటోలు పెట్టడం తగ్గించింది. ఆమె తన భర్త, తన పిల్లలతో దిగిన ఫొటోలే ఎక్కువగా షేర్ చేస్తోంది.

చాలా గ్యాప్ తర్వాత ఆమె ఈ రోజు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అవి పూర్తిగా డీగ్లామర్ ఫొటోలే కావడం విశేషం. ఎటువంటి మేకప్ లేకుండా సాదా సీదా చుడీదార్ లో దిగిన ఫోటోలు అవి. ఆమె తాజా పోస్టులను చూస్తుంటే ఆమె తన పద్దతిని పూర్తిగా మార్చేసింది అనిపిస్తోంది. ట్రోలర్స్ తో తట్టుకోలేక తానే మారిపోయింది.

Check Out: Anasuya without makeup!

అనసూయ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. ఆమె తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టింది.

 

More

Related Stories