
ఆరు గంటల్లోనే మాట మార్చింది అనసూయ. దాంతో, ఆమెకి మళ్ళీ ట్రోలింగ్ మొదలైంది. శనివారం ఉదయం… ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది ఆమె. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఏడుస్తున్న వీడియో చూసి అందరూ బాధపడ్డారు. ఆమెని ట్రోలర్స్ బాగా వేధిస్తున్నారు అని ఆమె ఆవేదనలో అర్థం ఉందని సింపతీ చూపించారు.
సోషల్ మీడియాలో, మీడియాలో ఇది బాగా ట్రెండ్ అయింది. ఐతే సాయంత్రానికి ఆమె మాట మార్చింది. నేను పెట్టిన వీడియో అర్థం వేరు. నేను పెట్టిన పోస్ట్ ను పూర్తిగా చదవకుండా, సరిగా అర్థం చేసుకోకుండా వైరల్ చేశారు అని చెప్పింది. తన ఏడుపు వీడియో ట్రోలింగ్ కి సంబంధించింది కాదు అని క్లారిటీ ఇచ్చింది.
జీవితంలో ఏదైనా సందర్భంలో బాధ వచ్చినా, మనదైన రోజు కానప్పుడు ఏడుపు వచ్చినా ఏడ్చేయ్యాలి. అది ఓకె తప్పు ఏమి కాదు. అని అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఆ వీడియో చేశాను అని తెలిపింది.
కొత్తగా ఆమె ఈ వీడియో పెట్టిన వెంటనే … “వచ్చిందండి ఆడ కమల్ హాసన్”, “ఆహా మహానటి” అంటూ జనం ట్రోలింగ్ చెయ్యడం మొదలుపెట్టారు. ఆమె ఏమి చేసినా ట్రోలింగ్ మాత్రం కామన్ అయిపొయింది.