
అనసూయ, రష్మీ అనుబంధం గురించి ఎప్పటికప్పుడు వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. కలిసి విహారయాత్రలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్నిసార్లు మాత్రం రష్మి-అనసూయ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, అవకాశాల కోసం ఇద్దరూ ఒకర్నొకరు తొక్కేసుకుంటున్నారంటూ కథనాలు వస్తుంటాయి.
వీటన్నింటిపై గంపగుత్తగా రియాక్ట్ అయింది అనసూయ. రష్మికి, తనకు మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని స్పష్టంచేసింది అనసూయ. అయితే విషయాన్ని బట్టి ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుంటాయని, ఆమాత్రం దానికి తమను శత్రువులుగా చూడడం సరికాదని అంటోంది.
“నేను, రష్మి ఏవరో ఏదో అంటే కింద పడిపోయే రకం కాదు. మేమిద్దం స్ట్రాంగ్ మహిళలం. రష్మి మెంటల్లీ చాలా స్ట్రాంగ్. నేను కూడా అంతే. మేమిద్దరం ఒకే ప్రొఫైల్, ఒకే సొసైటీలో కలిసి నివశిస్తున్నాం. ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం లేదు.”
ఇలా రష్మీతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టింది అనసూయ. సెట్స్ లో రష్మి, తను ఉన్నంత క్లోజ్ గా ఇంకెవరూ ఉండరని కూడా చెబుతోంది.