
ఎన్నో విషయాలపై ఓపెన్ గా రియాక్ట్ అయ్యే అనసూయ, ఈసారి మరో డిఫరెంట్ అంశంపై స్పందించింది. కొంతమంది తనను ఆంటీ..ఆంటీ అంటుంటే కాలుతోందని అంటోంది.
“మీసాలు గడ్డాలు వేసుకొన్నోళ్లు కూడా ఆంటీ అంటే కాలుతుంది. అయినా ఎవరో ఆంటీ అంటే మేం అయిపోం. మేం అవ్వాలనుకున్నప్పుడే ఆంటీలు అవుతాం. నిజమే నేను ఆంటీనే. కానీ అందరికీ కాదు. మా పిల్లల ఫ్రెండ్స్ కు నేను ఆంటీని. ఐదేళ్ల లోపు పిల్లలు నన్ను ఆంటీ అంటే ఓకే. “
నిజమే.. అనసూయ లాంటి అందగత్తెను ఆంటీ అనడానికి నోళ్లు ఎలా వస్తున్నాయో. కాకపోతే సరదాగా ఆమెను ఆటపట్టించడం కోసమే సోషల్ మీడియాలో కొంతమంది ఆంటీ అని పిలుస్తుంటారు, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
అనసూయకు ఎప్పుడో పెళ్లయింది. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె స్వయంగా చెబితే తప్ప ఆమె “ఆంటీ” అనే విషయం ఎవ్వరికీ తెలియదు. అలాంటి అనసూయను పట్టుకొని ఆంటీ అనడం నిజంగా తప్పే.