గిరిజన యువతిగా మారిన అనసూయ

బుల్లితెరపై గ్లామరస్ గా కనిపించే అనసూయ, వెండితెరపైకి వచ్చేసరికి మాత్రం పూర్తిగా మారిపోతుంది. గ్లామర్ కు దూరంగా నటనకు ఆస్కారం ఉండే పాత్రల్ని మాత్రమే ఎంచుకుంటుంది. ఇందులో భాగంగా మరో సినిమాకు ఓకే చెప్పింది అనసూయ. ఇందులో ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపిస్తోంది. ఆ పాత్రకు సంబంధించిన లుక్ ను కూడా తాజాగా విడుదల చేశారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లుగా ఓ సినిమా వస్తోంది. శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెలమూడి, వెంక‌ట్ కోవెలమూడి నిర్మాతలుగా రూపొందుతోన్న ఆ చిత్రానికి ‘వాంటెడ్ పండుగాడ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్ లైన్.

ఈ సినిమా నుంచి తాజాగా అన‌సూయ ఫ‌స్ట్ లుక్‌ విడుదల చేశారు. ఇందులో ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపిస్తోంది. ఆమె లుక్ కొత్తగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతా అనసూయను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుందని చెబుతోంది యూనిట్. ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ పూర్తి చేశారు. త్వరలోనే హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మరో షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.

సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. 3-4 రోజులు మాత్ర‌మే షూట్ బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేయబోతున్నారు.

 

More

Related Stories