
సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటిస్తోన్న ద్విభాషా చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా జూన్ 9న విడుదల కానుంది. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
సముద్ర ఖని పోషిస్తున్న వీరయ్య పాత్రకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే విడుదలైంది. తాజాగా ఇతర పాత్రధారుల పోస్టర్స్ విడుదల చేశారు.
వీరయ్య అనే పాత్రలో సముద్ర ఖని, అతని కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తున్నారు. సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపిస్తారు. వీరి పోస్టర్స్ ని తాజాగా ఆవిష్కరించారు.
తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే చిత్రం చిత్రం ఇది.