పాత పద్దతిలోనే అనసూయ

- Advertisement -
Anasuya

నటి అనసూయ భరద్వాజ్ కి, విజయ్ దేవరకొండకి ఏవో పాత సమస్యలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ గురించి డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో ఎదో ఒకటి కామెంట్ చేస్తుంటారు అనసూయ. ఐతే, ఆ మధ్య అనసూయ ప్రకటన చేసింది. ఇకపై సోషల్ మీడియాలో అనవసర విషయాల గురించి మాట్లాడానని, తన కెరీర్ విషయంలోనే ఆలోచిస్తాను అన్నట్లుగా ఎదో రాసుకున్నట్లు చూశాం.

ఈ ట్రోలింగ్ లు, ఈ అనవసర సోషల్ మీడియా రచ్చకి దూరంగా ప్రశాంతంగా తన పని తానేదో చేసుకుంటున్నారు అని చాలామంది ఆమెని మెచ్చుకున్నారు కూడా. ఆ ముచ్చట మూన్నాళ్ళే అయింది.

కానీ, ఇప్పుడు ఆమె అనవసరంగా ఒక కామెంట్ చేసి పాత పద్దతిలోనే వెళ్తున్నారు అనిపిస్తోంది. ఆమె పెట్టిన పోస్ట్ కి విజయ్ దేవరకొండ అభిమానులు, ఇతరులు స్పందిస్తే.. “భలే రియాక్ట్ అవుతున్నారు దొంగ… ఊప్స్ బంగారుకొండలంతా” అంటూ మరో పోస్ట్.

గిల్లడం ఎందుకు… గిల్లిన తర్వాత మళ్ళీ వాళ్ళూ గిల్లుతున్నారు అని అనడం ఎందుకు?

ఇంతకీ సమస్య ఏంటంటే… విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు “THE” అని తగిలించుకోవడం ఆమెకి నచ్చలేదు కాబోలు. తాజాగా ‘ఖుషి’ సినిమా మొదటి పాట ఈ నెల 9న విడుదల కానుంది అని నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. అందులో “THE విజయ్ దేవరకొండ”

అని ఉంది. ఆమె ఇప్పుడు ఆ పోస్టర్ ని చూసినట్లున్నారు. దాంతో, ఇలా పోస్ట్ పెట్టారు. “Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam” (ఇపుడే ఒకటి చూశాను . “ది”నా?? బాబోయ్ పైత్యం… ఎం చేస్తాం అంటకుండా చూసుకుందాం”).

విజయ్ దేవరకొండ పేరు లేకున్నా ఆమె ఎవరు గురించి ఈ పోస్ట్ పెట్టారో ఈజీగా అర్థం అవుతోంది. ఐతే, “ది విజయ్ దేవరకొండ” అని అట్టర్ ఫ్లాప్ ఐన “లైగర్” సినిమా టైటిల్స్ లోనే వేశారు. ఈ సినిమాకే ఆయన అలా వాడడం లేదు. అలా పేరు ముందు “ది” పెట్టుకోవడం అతి చర్యనా కాదా అన్నది పక్కనా పెడితే అనసూయ ఇప్పుడు దాని గురించి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు.

Vijay Deverakonda

ఇంతకుముందే “లైగర్” సినిమా ఫ్లాప్ కాగానే తన అక్కసు అంతా అప్పుడే సోషల్ మీడియా ద్వారా తీర్చేసుకున్నారు. విజయ్ దేవరకొండ ఒక సోషల్ మీడియా టీం ద్వారా తనని బద్నామ్ చేశారని ఆమె ఆవేదన. ఆ కోపంతో ఆమె “లైగర్” ఫ్లాప్ కాగానే తన ఆనందాన్ని దాచుకోకుండా ట్విట్టర్ లో వెళ్లగక్కేశారు.

ఆ తర్వాత జరిగిన రచ్చ… అదంతా సద్దుమణిగింది. జనం మర్చిపోయారు. ఆమె కూడా సోషల్ మీడియాలో మునుపటిలా పెద్దగా స్పందించడం లేదు.

ఐతే, ఇప్పుడు ‘ది’ అనే కామెంట్ ఆమె కావాలనే రెచ్చగొట్టినట్లింది. ఆమె వివాదాన్ని రేపి జనం దానికి స్పందిస్తే మళ్ళీ ఆమె తనని జనం ఇలా తిడుతున్నారు అని స్క్రీన్ షాట్ లు పెడుతుండడం పెట్టడం విశేషం.

 

More

Related Stories