మేకప్ లేని అనసూయ ఇలా!

- Advertisement -
Anasuya Bharadwaj


అనసూయకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆమె చాలా హాట్ గా ఉంటుంది అనేది ఆమె అభిమానుల మాట.ఆమె ఫోటోషూట్ లు కవ్వించేలా ఉంటాయి. ఆ ఫోటోషూలు చేస్తూ వాటిని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చెయ్యడం అనసూయకి అలవాటు.

ఐతే, గత మూడు వారాలుగా అవి దర్శనమివ్వడం లేదు. ఎందుకంటే, ఇటీవలే ఆమె తండ్రి కన్నుమూశారు. ఆ బాధలో ఉన్న అనసూయ ఫోటోషూట్ లకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. తాజాగా ఆమె ఒక ఫోటోని షేర్ చేసింది. ఎటువంటి మేకప్ లేకుండా తాను రియల్ గా ఎలా ఉంటుందో తెలిపే సెల్ఫీని పోస్ట్ చేసింది అనసూయ.

గోడమీద తన తండ్రి ఫోటోని చూపిస్తూ ఈ సెల్ఫీని షేర్ చేసింది అనసూయ. ఫోటోషూట్ లలో కనిపించే అనసూయకి, నిజజీవితంలో మేకప్ లేకుండా ఉండే అనసూయకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో ఆమె అభిమానులకు తెలిసింది. తమ అందం మీద, తమ టాలెంట్ పై తమకి ఎంతో నమ్మకం ఉన్న నటులు తప్ప మిగతావారు మేకప్ లేని రియల్ ఫోటోలను షేర్ చేసేందుకు సాహసం చెయ్యరు. అనసూయకి ధైర్యం ఎక్కువ. తన టాలెంట్ పై గురి ఉంది.

ఇటీవలే ‘పుష్ప’లో ఆమె ఒక పాత్రలో కనిపించింది. ఐతే, ఆమె పాత్రకి ఎటువంటి వాల్యూ లేదు ఈ మొదటి భాగంలో. ఆమె అసలు సీన్లు అన్ని రెండో భాగంలో ఉంటాయాట.

 

More

Related Stories