బికినీ వేసేంత బాడీ లేదట

- Advertisement -

హీరోయిన్లలో కొంతమంది బికినీ వేస్తారు, మరికొందరు దానికి వ్యతిరేకం. కానీ కొందర్ని అసలు ఈ ప్రశ్న కూడా అడగాలని అనిపించదు. ఎందుకంటే వాళ్లకున్న ఇమేజ్ అలాంటిది. ఉదాహరణకు అనసూయనే తీసుకుందాం. ఈమెను పట్టుకొని ఎవరైనా “మీరు బికినీ వేస్తారా” అని అడుగుతారా? అనసూయ మాత్రం దీనిపై సూటిగా స్పందించింది.

తనకు బికినీ వేయడం ఇష్టమే కానీ సిల్వర్ స్క్రీన్ పై టు-పీస్ బికినీతో కనిపించాలంటే చాలా వర్కవుట్ చేయాలంటోంది ఈ భామ. బికినీ బాడీని సొంతం చేసుకోవడం చాలా కష్టమని చెబుతోంది. బికినీ వేసుకునే ధైర్యం  తనకు ఉన్నప్పటికీ.. ఫిజిక్ మాత్రం ప్రస్తుతానికి లేదని ఓపెన్ గా చెబుతోంది.

నిజమే.. బికినీ వేయాలంటే ధైర్యం మాత్రం ఉంటే సరిపోదు. బాడీ షేప్ కూడా ముఖ్యమే. అందుకే హీరోయిన్లంతా బికినీలు వేయలేరు. తను కూడా అలాంటి బికినీ వేషాలు వేయలేనంటోంది అనసూయ

 

More

Related Stories